Old age home

1ఎ.టి.కె సంస్ధ ద్వారా వృద్ధాశ్రమం, నిరుపేద కుటుంబాల నుండి వచ్చిన బాలురకు విద్య, వైద్యం తదితర సౌకర్యాలు అందించాలని తలచాం. బాబామెట్టలో 222 సర్వేనెంబరు 2లో ఉన్న ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. మా ఆలోచనని జిల్లా అధికారులకు తెలుపగా, వారు ప్రభుత్వము నుండి మంజూరునకు ప్రయత్నించమన్నారు. మేము మున్సిపాలిటీకి, జిల్లా యంత్రాంగానికి లిఖితపూర్వక దరఖాస్తు ఇవ్వగా, సర్వేచేసి హైదరాబాద్ సి.ఎల్.ఆర్ నకు పంపించారు. వారు పరిశీలించి, కేబినేట్ కు పంపించారు. కేబినేట్ నామమాత్రపు ధరకు మా సంస్ధకు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు వారు నిర్ణయించిన ధరని చెల్లించాం.

సుమారు 2ఎకరాలను మంజూరు చేయగా 25సెంట్లు వాటర్ బెడ్ గా ఉంచాలన్న తీర్మానాన్నిచ్చారు. వరి ఆదేశాల మేరకు 25సెంట్లు వాటర్ బెడ్ మేం మా స్వంత నిధులతో అభివృద్ధిపరచాం. అలాగే మంజూరు చేసిన స్ధలంలో వృద్ధాశ్రమాన్ని, బాలుర ఆశ్రమాన్ని నిర్మించాం. ప్రతి వృద్ధునికి ప్రత్యేక మంచం..తదితర సౌకర్యాలతో పాటు తమ ఆరోగ్యానికి సరిపడ భోజనాలు, మందులు, వ్యాయామం, వినోదం వంటి సకల ఏర్పాటులు చేసాం.