Orphanage

12ఎ.టి.కె సంస్ధ ద్వారా వృద్ధాశ్రమం, నిరుపేద కుటుంబాల నుండి వచ్చిన బాలురకు విద్య, వైద్యం తదితర సౌకర్యాలు అందించాలని తలచాం. బాబామెట్టలో 222 సర్వేనెంబరు 2లో ఉన్న ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. మా ఆలోచనని జిల్లా అధికారులకు తెలుపగా, వారు ప్రభుత్వము నుండి మంజూరునకు ప్రయత్నించమన్నారు. మేము మున్సిపాలిటీకి, జిల్లా యంత్రాంగానికి లిఖితపూర్వక దరఖాస్తు ఇవ్వగా, సర్వేచేసి హైదరాబాద్ సి.ఎల్.ఆర్ నకు పంపించారు. వారు పరిశీలించి, కేబినేట్ కు పంపించారు. కేబినేట్ నామమాత్రపు ధరకు మా సంస్ధకు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు వారు నిర్ణయించిన ధరని చెల్లించాం.

సుమారు 2ఎకరాలను మంజూరు చేయగా 25సెంట్లు వాటర్ బెడ్ గా ఉంచాలన్న తీర్మానాన్నిచ్చారు. వరి ఆదేశాల మేరకు 25సెంట్లు వాటర్ బెడ్ మేం మా స్వంత నిధులతో అభివృద్ధిపరచాం. అలాగే మంజూరు చేసిన స్ధలంలో వృద్ధాశ్రమాన్ని, బాలుర ఆశ్రమాన్ని నిర్మించాం.పిల్లలకు ప్రత్యేక గదులు, వారి ఇష్టం మేరకు వారికి నచ్చిన కోర్సులో జాయిన్ అయ్యే అవకాశం కల్పించాం. ప్రైవేటు కళాశాలల్లో కూడా కొందరు చదువుతున్నారు. పోలిటెక్నిక్..ఐటిఐ ఇతర సాంకేతిక విద్యలను అందిస్తున్నాం. వారి ఫీజులు, దుస్తులు, పోషక ఆహారం, రవాణా తదితర సకల సదుపాయాలు కల్పిస్తున్నాం. ప్రతీ నెలలో ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇతర కళారూపాలలో…పాల్గొనేందుకు ఆసక్తి పెంచేందుకు వ్యాసరచనా పోటీలు, వక్తృత్వం..నిర్వహిస్తున్నాం. అలాగే రోటరీక్లబ్, జిల్లా మెడికల్ అసోసియేషన్ వారితో కలిసి మెడికల్ క్యాంప్ లు, ఉచిత మందుల పంపిణి, కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. జిల్లాలో ఇతర ప్రాంతంలో ఉన్న విద్యార్థుల వద్దకు వెళ్ళి అప్పుడప్పుడు పోషక ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాం.