About

scan0033

ఏ.టి.కె. ఆధ్యాత్మిక సేవాసంస్ధ
విజయనగరంలో బాబామెట్ట ప్రాంతంలో 2004లో కేవలం కొద్దిమందితో ప్రారంభమైంది. ప్రతీ తరానికి స్వభావాలు మారుతాయి..అగుపించని ప్రభావాలకు లొంగుతాయి. నానాటికీ విలువలు అగోచరమై…ఆదర్శాలు అక్కరకు రాకుండా పోతున్నాయి. ఇలాంటి దశలో ఒక వ్యక్తి….బహువచనమై, అందరి కోసం ఒక్కడుగా నిలిచి…అందరినీ కలుపుకొచ్చి…ఒక వేదికను సిద్ధం చేసుకున్నాడు.ఇప్పుడది ఒక్కరిది కాదు. ఎందరికో స్పూర్తిని, స్పందనని ఇచ్చే సంస్ధగా మారింది. సభ్యత్వాలు..రుసుములు..చందాలుకు దూరంగా ఉండి, సేవచేయాలన్న తలంపు వున్నవారు తమతో రావాలని పిలుపునిచ్చింది. అలా వచ్చిన వారిని తమలో కలుపుకొని ముందుకు కొనసాగుతోంది. అదే ఏ.టి.కె. ఆధ్యాత్మిక సేవాసంస్ధ.
కుల, మత, వర్గ రహితంగా ఒక వైపు దేవాలయాలకు, వేరొక వైపు దర్గాలకు మరమ్మత్తులు, పండుగల నిమిత్తం వేలాది రూపాయలను వెచ్చించటం “ఏ.టి.కె.” మతసామరస్య, సమాక్య భావానికి నిదర్శనం. మా సభ్యులు రాష్ర్టంలో అనేక ప్రాంతాలలో నివసిస్తున్నా ఎవరికి వీలైన సహాయం వారు చేస్తుంటారు. కొందరు రక్తదానం మరికొందరు విద్యాదానం, వస్త్రదానం ఇలా వారిలో సేవాదృక్ఫదం మరింత పెంచగలిగాము.