Otherservices

స్ధానిక బాబామెట్ట నుంచి డబుల్ కాలనీకి వెళ్ళే రోడ్డుని గమనించింది. ఎంతో మంది నిత్యం ఆ దారి వెంట వెళ్ళేవారు కంకర రాళ్ళు బయటకు వచ్చి, రోడ్డుకు పెద్ద పెద్ద కన్నాలు…కొన్ని కాలువలపై కనీసం కాజ్ వే కూడాలేని స్ధితి. వెళ్ళే దారిలో ఒకచోట చిన్న వంతెన కట్టారు. వంతెన క్రింద ఆరు అడుగుల లోతు ఉంది. కానీ, వంతెన పైన ఉన్న అయిదడుగుల విస్తారంలో మధ్యన నాలుగడుగుల కన్నం. ఇదీ దుస్ధితి. రోజుకు కనీసం ముగ్గురు, నలుగురు ఆ గోతులో పడి గాయాలైన వారే. అలాగే వర్షం వస్తే కొందరు చిన్న పిల్లలు దానిలో పడి చనిపోయారు కూడా!…అయినా యంత్రాంగం స్పందించలేదు. ఆ పరిస్ధితిని మార్చాలని ఎ.టి.కే. సంస్ధ ముందుకు వచ్చింది. ఒక దరఖాస్తు మున్సిపాలిటీకి పెట్టింది. ఆ దరకాస్తు పట్టుకొని సుమారు అయిదు నెలలు కార్యాలయాల చుట్టూ తిరిగింది. రోజూ ఆ దారిలో గాయాలౌతున్న గ్రామస్ధుల ఫొటోలను పత్రికల్లో ప్రచురించింది. ఎట్టకేలకు ఆ దారికి నిధులుమంజూరు అయ్యాయి. కానీ, పనులు ఏడాదికాలం పట్టాయి. చివరకు 30 అడుగుల రోడ్డు 30వేల మందికి నిత్యం అందుబాటులోకి వచ్చింది.

బాబావారి దర్బార్, దర్గా ప్రాంగణాలకు నిత్యం వేలాది మంది దర్శనార్ధం రావటం, అలాగే డబుల్ కాలనీలో ఉన్న అమ్మవారి ఆలయానికి కూడా భక్తులు నిత్యం రావటం గమనించాము. వెంటనే నాటి విజయనగరం నియోజక వర్గం పార్లమెంట్ సభ్యులు శ్రీ బొత్స సత్యన్నారాయణ వారిని సంప్రదించి, వీధి దీపాలు వేయాలని కోరాం. అయితే వాటికి నిధులు మంజూరు చేసింది కాని, చాలలేదు. దాంతో సంస్ధ స్వచ్ఛంద్ధంగా ముందుకు వచ్చి, 16వీధి దీపాలను మెర్క్యురీలేంప్స్ ని దర్భారు, దర్గా ప్రాంగణంలో వేయడం జరిగింది… అలాగే అమ్మవారి కోవెలకు సంస్ధ నుంచి కొంత సాయం అందించడం జరిగింది. తర్వాత మున్సిపల్ అధికారులతో మాట్లాడి వీధి దీపాల ఏర్పాటు జరిగింది.

scan0009అలాగే గ్రామదేవతల పండుగలలో అన్న సమారాధనా కార్యక్రమాన్ని చేపట్టాం. స్తానిక బాబామెట్టలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉందని గ్రహించి, అక్కడ 80ఏళ్ళ క్రితం ఉన్న బాబావారు తవ్వించిన బావిని లోతు చేసి, చప్టాలు కట్టి, స్ధానికులకు నీటి ఎద్దడిని తీర్చడం జరుగుతోంది. అలాగే సమీపాన ఉన్న ఎర్రచెరువు పశువుల నీటి కోసం బాగుచేయాలని తలచి, జిల్లా కలక్టర్ వారిని కోరగా మాకు దత్తతగా దానిని ఇచ్చారు. సుమారు రెండు ఎకరాలు ఉన్న ఆ చెరువును లక్షలాది రూపాయలు వెచ్చించి బాగుచేశాం. దానికి కంచె వేసి, రెండు భాగాలు చేసి మధ్యలో రహదారిని నిర్మించాం. ఒక వైపు పశువులకు, వేరొక వైపు మొక్కల పెంపకానికి దానిని వినియోగించడం జరుగుతోంది. పచ్చదనం..పరిశుభ్రత కోసం సుమారు 10వేల మొక్కలను నాటాం.

అనాధలు, ఏ ఆసరాలేని నిరుపేద కుటుంబం నుంచి పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్లలకు వారు సంబంధాలు చూసుకుంటే పెళ్ళికి అయ్యే ఖర్చులు ఇవ్వటం, లేదా మా సంస్ధ నుంచే వారికి పెళ్ళిళ్ళు చేయడం జరుగుతోంది. నెలకు ఒక సారి పేదవారికి దుస్తులు పంపిణి, అన్న సమారాధన చేస్తూంటాం. ఇక జిల్లాలో వికలాంగుల సంక్షేమానికి ట్రైసైకిళ్ళు, వితంతువులకు కుట్టుమిషన్ లు పంపిణీ చేయడం జరిగింది.

ఇది ఇలా ఉండగా రాష్ర్టాన్ని కుదిపేసిన హుదూద్ తుఫాను, అంతకు ముందు వచ్చిన నీలం తుఫానుల్లో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు విజయనగరం నుంచి కృష్ణాజిల్లాకు బయలుదేరి (గ్రామగ్రామాన) వారికి ఆసరాగా నిలిచి నిత్యం అన్నసమారాధనను, బట్టల పంపిణీని నేరుగా వారికి అందించాం. సుమారు నెల రోజులు అక్కడ స్ధానిక ఎమ్మెల్యేల అండతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది.